Share News

ఇసుక విధానంపై చర్చకు రావాలి

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:39 PM

: ఉచిత ఇసుక విధానంపై చింతాడ రవికుమార్‌తో పాటు వైసీపీ నాయకులు చర్చకు రావాలని టీడీపీ నాయకులు సవాల్‌ విసిరారు.

 ఇసుక విధానంపై చర్చకు రావాలి
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు:

ఆమదాలవలస, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక విధానంపై చింతాడ రవికుమార్‌తో పాటు వైసీపీ నాయకులు చర్చకు రావాలని టీడీపీ నాయకులు సవాల్‌ విసిరారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు సనపల ఢిల్లీశ్వరరావు, కిల్లి సిద్దార్ధ, కంచరాన లోకేష్‌, కళిం గ కార్పొరేషన్‌డైరక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌ విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై వైసీపీ నాయ కులు చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. గత ప్రభుత్వంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.ఐదు వేలుకు కొనుగోలు చేసిన నిర్మాణదారులకు నేడు రూ.800కే దొరకుతోందని తెలిపారు.అటువంటి జనరంజక ఇసుక విధానాన్ని వైకాపా చోటా నాయకుడు చింతాడ రవికుమార్‌ కోట్ల రూపాయలు దోపిడీ జరుగు తుందంటూ అసత్య ప్రచారాలు చేయడం అవివేకమన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు తమ్మినేని అప్పలనాయుడు, బొడ్డేపల్లి విజయ్‌, హను మంతు బాలకృష్ణ, గణపతి పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 11:39 PM