వైసీపీ పాలనలో పల్లెల్లో అభివృద్ధి శూన్యం
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:40 PM
వైసీపీ ఐదేళ్ల కాలంలో పల్లెల్లో అభివృద్ధి పడకేసిందని, ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

టెక్కలి/నందిగాం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల కాలంలో పల్లెల్లో అభివృద్ధి పడకేసిందని, ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్ర వారం నర్శిపురం-బూరగాం, నందిగాం మండలం దిమిలాడలో సీసీ రోడ్డు, దిమిలాడ- బూరగాం- లింగాలపాడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనిచే స్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా ఎన్ని కలకు ముందు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు. పల్లెల ప్రగతికి రహదారులే కీలకమన్నారు. జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా అర్హులైన తల్లుల ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామన్నారు. అనంతరం బూరగాంలో రూ.7 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును ప్రారంభించారు. అచ్చె న్నాయుడు ద్విచక్రవాహనంపై పర్యటిస్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు ఎం.కృష్ణమూర్తి, జి.వెంక టేష్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జామి సుధా కర్, ఈఈ సత్యనారాయణ, డీఈఈ రవికాంత్, టీడీపీ నాయకులు బగాది శేషగిరి రావు, పినకాన అజయ్‌కుమార్, మళ్ల బాలకృష్ణ, పి.చంద్రశేఖర్, లోకనాథం, జీరు నానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.