కాలువలు లేవు.. రోడ్లు ఏర్పాటు చేయలేదు
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:54 PM
మండలంలోని జమ్ము పంచాయతీ పరిధిలోగల గడ్డెయ్యపేట, రావాడపేట, జమ్ము వద్ద పదకొండు లేఅవుట్‌ల్లో సమస్యలు తిష్ఠవేశాయి. ప్రధానంగా కాలువలు, రోడ్లు ఏర్పాటుచేయలేదు. ఇక్కడ 1143 మందికి నివాసాలు మంజూరుచేస్తూ కాలనీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
నరసన్నపేట, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని జమ్ము పంచాయతీ పరిధిలోగల గడ్డెయ్యపేట, రావాడపేట, జమ్ము వద్ద పదకొండు లేఅవుట్‌ల్లో సమస్యలు తిష్ఠవేశాయి. ప్రధానంగా కాలువలు, రోడ్లు ఏర్పాటుచేయలేదు. ఇక్కడ 1143 మందికి నివాసాలు మంజూరుచేస్తూ కాలనీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇక్కడ పలు ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహా ప్రవేశాలు కూడా జరిగాయి. మరికొన్ని గోడలు, పునాదుల దశలో నిలిచిపోయాయి. ఇటీవల కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేకున్నా కాలనీలో సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. 11 కాలనీల్లో ఇంటింటా తాగునీటి కుళాయిలు, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మాణాలు ఇప్పటివరకూ చేపట్టలేదు.కాలనీల్లో పిచ్చిమొ క్కలు పెరగడంతో ఇక్కడ నివాసముంటున్నవారు భయాందోళన చెందుతు న్నారు. ప్రస్తుతం 800 వరకూ గృహ ప్రవేశాలు జరగ్గా 2,500 మంది వరకూ నివాసముం టున్నారు. అయితే పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటుకు నోచుకోలేదు. ఎవరైనా మృతిచెందితే నరసన్నపేటలోని శ్మశానానికి అంత్యక్రియలకోసం తీసుకు వెళ్లాల్సివస్తోందని వాపోతున్నారు.
శాశ్వత చిరునామా లేక..
జమ్ము పంచాయతీలో వైసీపీహయాంలోఏర్పాటుచేసిన జగనన్నకాలనీలో(ఎన్టీఆర్ కాలనీ) నరసన్నపేట, జమ్ము, తామారాపల్లి, బొరిగివలస, గోపాలపెం తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులతోపాటు పోలాకి శ్రీకాకుళం రూరల్ మండలాలకు చెం దిన పలువురు లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు కేటాయించారు. కాలనీలో 70 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ప్రస్తుతం ప్రవేశాలుచేశారు. ఇక్కడ నివసిస్తున్న వారికి ఆధార్ కార్డులో శాశ్వత చిరునామా లేదు. గతంలో ఎక్కడ నివసించే వారో అక్కడి అడ్రస్‌తో ఉంటోంది. గతంలో ఉండే గ్రామాల్లోనే ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. రేషన్ సరుకులు, పింఛన్లకోసం నెలకోసారి గతంలో నివాసముండే గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. కాలనీలకు పేరు పెట్టి జమ్ము పంచాయతీలో అంతర్భాగం చేస్తే శాశ్వత గృహాలు ఉన్నట్లు ఆధార్‌లో అడ్రాస్ నమోదవుతుందని పలువురు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ అందించే పథకాలు కూడా ఇక్కడ నుంచే పొందే అవకాశం లభిస్తుంది. ఇప్పటికైనా అధికారులు జమ్ముపంచాయతీలో ఏర్పాటుచేసిన లేఅవుట్‌ల్లో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు శాశ్వత చిరునామకు అవకా శం కల్పించి, ఇక్కడే ప్రభుత్వపథకాలు అందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
సమస్యలు గుర్తించాం
జగనన్న కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం తదితర సమస్యలను గుర్తించి నివేదికలను సిద్ధం చేశామని నరసన్నపేట ఎంపీడీవో వెంకటేష్ ప్రసాద్ తెలిపారు. ప్రతిపాదనలు కూడా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళామని చెప్పారు. కాలనీలో అభివృద్ధి పనులు మంజూరైన తక్షణమే సమస్యలు పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.