Share News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల కోసం చోరీలు

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:26 AM

Two members arrested, four two-wheelers seized ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, పేకాట కోసం ముగ్గురు వ్యక్తులు దొంగలుగా మారారు. తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలు చేసే వారు. ద్విచక్ర వాహనాలను సైతం దొంగిలించి.. వాటిని విక్ర యించిన డబ్బుతో బెట్టింగ్‌లు ఆడేవారు. పోలీసులు నిఘా వేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుం చి నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల కోసం చోరీలు
మాట్లాడుతున్న డీఎస్పీ లక్ష్మణరావు, పోలీసుల అదుపులో నిందితులు

  • ఇద్దరి అరెస్టు.. నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

  • పలాస, నవంబరు 30(ఆంధ్ర జ్యోతి): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, పేకాట కోసం ముగ్గురు వ్యక్తులు దొంగలుగా మారారు. తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలు చేసే వారు. ద్విచక్ర వాహనాలను సైతం దొంగిలించి.. వాటిని విక్ర యించిన డబ్బుతో బెట్టింగ్‌లు ఆడేవారు. పోలీసులు నిఘా వేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుం చి నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ లక్ష్మణరావు ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

  • ఎచ్చెర్ల మండలం దుప్పలవలస గ్రామా నికి చెందిన బూసర లక్ష్మణరావు, గుజరాతీ పేటకు చెందిన పిండ్రాల చిన్నతోపాటు మరో వ్యక్తి ఈ ఏడాది అక్టోబరులో కాశీబుగ్గ మోర్‌ సెంటరు వద్ద మోటారు వాహనం, ఆంధ్రాబ్యాంకు వీధిలో మరో వాహనం, శ్రీనివాసనగర్‌ చిన్నతిరుమల ఆలయం వద్ద ద్విచక్రవాహనం, కాశీబుగ్గ బస్టాండు వద్ద అన్నక్యాంటీన్‌ వద్ద దిచక్రవాహనాలు దొం గిలించి పరారీ అయ్యారు. అలాగే శ్రీకాకుళం పీఎన్‌ కాలనీలో తాళాలు వేసిన ఇంట్లోకి చొరబడి ఐదు తులాల వెండి పట్టీలను దొం గిలించారు. బొబ్బిలి వెలమవారివీధిలో ఓ ఇంటిలో ప్రవేశించి 12 తులాల బంగారం ఆభరణాలు, వెండి వస్తువులు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆది వారం లక్ష్మణరావు, చిన్న ద్విచక్ర వాహనం పై పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తుండగా అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో సీఐ పి.సూర్యనారాయణ, ఎస్‌ఐ నర్సింహమూర్తి వారిని ఆపి విచారించగా చోరీల విషయం బయటపడింది. బైక్‌లు, పలు ఇళ్లలో చోరీలు చేసినట్టు వారు అంగీకరించారు. లక్ష్మణరావు గ్రామంలో విద్యుత్‌ పనులు చేసేవాడు. ఈ క్రమంలో ఆయనకు పొరుగు గ్రామమైన చిన్న పరిచయం కావడంతో ఇద్దరూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, పేకాటకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్నారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలకు అలవాటు పడ్డారు. వారిద్దరినీ అరెస్టు చేశామని, పలాస కోర్టులో సోమవారం హాజరుపరుస్తామని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సీఐ సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:26 AM