వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు చోరీ
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:58 PM
దీర్గాశి గ్రామానికి చెందిన మెండ గడ్డెమ్మ అనే వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును ద్విచక్రవాహనంపై వచ్చి న గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకు పోయిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
పోలాకి ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): దీర్గాశి గ్రామానికి చెందిన మెండ గడ్డెమ్మ అనే వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును ద్విచక్రవాహనంపై వచ్చి న గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకు పోయిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, బా ధితురాలు తెలిపిన వివరాల మేరకు.. గ్రామ శ్మశాన వాటిక వద్ద గల కాలువలో గడ్డెమ్మ బకెట్‌ను శుభ్రం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఒకరు బండిపై ఉండి.. మరొకరు ఆమె వద్దకు వెళ్లి మెడలో ఉన్న పుస్తెలతాడును దొంగలించుకుపోయారు. ఆమె కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొంత మంది యువకులు వారు వెళ్లి వైపు ద్విచక్ర వా హనాలపై వెళ్లినా వారి జాడ కనిపించలేదు. విషయాన్ని గ్రామస్థులకు చెప్పగా.. మాజీ సర్పంచ్ పల్లి సూరిబాబు పోలీసులకు సమాచారం అందించారు. నరసన్నపేట సీఐ జెర్రిపోతుల శ్రీనివాసరావు, ఎస్‌ఐ రంజిత్ సిబ్బంది, క్లూస్ టీమ్‌తో చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి చోరీ జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు.