శ్రీకాకుళం నగరంలో చోరీ కలకలం
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:13 AM
నగ ర పరిధి తిలక్‌నగర్‌లోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కలకలం రేపింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.
35 గ్రాములు బంగారం అపహరణ
ఆలస్యంగా వెలుగులోకి..
పోలీసుల అదుపులో అనుమానితులు?
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): నగ ర పరిధి తిలక్‌నగర్‌లోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కలకలం రేపింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. సుమారు 35 గ్రాముల బంగారం ఆభరణాలు అపహరణకు గురైనట్టు పోలీసు లు గుర్తించారు. శ్రీకాకుళం రెండో పట్టణ పో లీసులు తెలిపిన వివరాల మేరకు.. యాంకర్ గా పనిచేస్తున్న కారగ్గి మీన తన తల్లి పార్వత మ్మతో కలిసి తిలక్‌నగర్‌లో నివాసం ఉంటోంది. దేవీ నవరాత్రులు సందర్భంగా భవానీమాల వేసు కునేందుకు మీనా తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను గతనెల 21వ తేదీన బీరువాలో పెట్టింది. దీక్ష ముగించుకొని ఈనెల 5న తిరిగి ఇంటికి వచ్చినా బీరువాలో ఉన్న ఆభరణాలను చూసుకోలేదు. 7వ తేదీన విజయనగరంలో జరిగిన పైడితల్లి అమ్మవారి జాతరకు వెళ్లేందుకు ప్రయా ణమవుతున్న సందర్భంలో బీరువాలో ఉన్న ఆభరణాలను వేసుకుందామని చూసేసరికి అవి కనిపించకుండా పోయాయి. దీంతో మీనా టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో టూటౌన్ సీఐ ఈశ్వరరావు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు ఉన్నట్టు సమాచారం.