Share News

సెల్‌ఫోన్‌, టైలరింగ్‌ షాపుల్లో చోరీ

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:14 AM

పోలీసు పహ రా ఉండే కాశీబుగ్గ కేటీ రోడ్డు శ్రీనివాస లాడ్జి జం క్షన్‌ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువా త దొంగలు రెచ్చిపోయారు.

సెల్‌ఫోన్‌, టైలరింగ్‌ షాపుల్లో చోరీ
టైలరింగ్‌ షాపులో సీసీ కెమెరాకు చిక్కిన ముసుగుదొంగ

  • రూ.1.20 లక్షల నగదు, దుస్తులు అపహరణ

పలాస, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పోలీసు పహ రా ఉండే కాశీబుగ్గ కేటీ రోడ్డు శ్రీనివాస లాడ్జి జం క్షన్‌ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువా త దొంగలు రెచ్చిపోయారు. ఓ సెల్‌ఫోన్‌ షాపులో తాళాలు విరగ్గొట్టి షాపులో వివిధ వ్యాపారులకు చెల్లించడానికి దాచి ఉంచిన నగదు రూ.1.20 లక్ష లు అపహరించారు. దానికి సమీపంలో ఉన్న ఓ టైలరింగ్‌ షాపులో ప్రవేశించి అందులో నగదు ఏ దీ లభ్యం కాకపోవడంతో దుస్తులను అపహరిం చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉ న్నాయి. బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన నిమ్మన షన్ముఖరావు కేటీ రోడ్డులోని బా లాజీ సెల్‌ఫోన్‌ సర్వీసింగ్‌ సెం టరు నిర్వహిస్తున్నారు. దీనికి ఆనుకొని ఓ టిఫిన్‌ షాపును కూ డా వీరే నిర్వహిస్తున్నారు. ఈ క్ర మంలో బుధవారం వేకువజాము యజమాని షన్ముఖరావుతో పాటు ఆయన సోదరుడు యువరాజ్‌ షాపు వద్దకు వచ్చేసరికి తాళాలు విరగొట్టి షట్టర్‌ తెరిచి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే క్యాష్‌ కౌంట రులో నగదు చూడగా మాయం అయినట్టు గుర్తించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ పి.సూర్యనారాయ ణ, క్లూస్‌టీమ్‌ సభ్యులు ఘటన స్థలానికి వచ్చి ఆ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి ఆధా రాలు సేకరించారు. అదేవిధంగా పలాసలో నివా సం ఉంటున్న జినగ గోపాల్‌ కేటీ రోడ్డు గున్నేశ్వర నగర్‌లో స్టైలిస్ట్‌ టైలరింగ్‌ షాపు నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ముసుగువేసుకున్న ఓ అగంతకుడు ప్రవేశించి షాపులో క్యాష్‌బాక్స్‌ను తెరిచాడు. అందులో ఏవీ లభించకపోవడంతో వినియోగదా రులకు అందించాల్సి ఉన్న దుస్తులను అపహరిం చుకుపోయాడు. బుధవారం ఉదయం షాపు తెరి చేందుకు వచ్చిన యజమానికి తాళాలు బద్దలు కొట్టినట్టు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. షాపులో సీసీ కెమెరాలో ఓ దొంగ ఉన్నట్టు గుర్తించారు. అయితే ముసుగు ధరిం చడంతో ఆయన్ను పోల్చుకోవడం కష్టంగా మారింది. మొత్తం రెండు కేసులకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - Aug 07 , 2025 | 12:14 AM