Share News

సినీ ఫక్కీలో చోరీ

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:07 AM

కొంతమంది మహిళలు బ్యాంకులో రుణం తీసుకు న్నారు. వారిలో ఇద్దరు బట్టల దుకాణానికి వెళ్లారు. వీరిని మరో ముగ్గు రు మహిళలు అనుసరించారు.

సినీ ఫక్కీలో చోరీ
బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ చిరంజీవి

  • రూ.లక్ష అపహరణ.. రణస్థలంలో కలకలం

రణస్థలం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కొంతమంది మహిళలు బ్యాంకులో రుణం తీసుకు న్నారు. వారిలో ఇద్దరు బట్టల దుకాణానికి వెళ్లారు. వీరిని మరో ముగ్గు రు మహిళలు అనుసరించారు. వారు బట్టల కొనుగోలులో బిజీగా ఉం డగా రూ.లక్ష చోరీ చేసి ఉడాయించారు. రణస్థలంలో గు రువారం మధ్యాహ్నం సినీఫక్కీలో ఈ చోరీ జరిగింది. పో లీసులు తెలిపిన వివరాల మేరకు.. కొచ్చెర్ల గ్రామానికి చెందిన శ్రీనివాస మహిళా సంఘం సభ్యులు గురువారం ఉదయం రణస్థలంలోని ఓ బ్యాంకుకు వచ్చారు. పది మంది సభ్యులు రూ.19 లక్షల రుణం పొందారు. ఒక్కొ క్కరూ రూ.1,90,000 పంచుకున్నారు. వాటిని పాలిథిన్‌ కవర్లలో పెట్టుకున్నారు. వీరిలో బసవ గురమ్మ, లంకపల్లి మాధురి సమీపంలోని బట్టల దుకాణానికి వెళ్లారు. అప్ప టికే వీరిని గమినిస్తున్న ముగ్గురు మహిళలు అనుసరిం చారు. వారు పాలిథిన్‌ కవర్లో డబ్బులు ఉంచగా కత్తిర తో కవర్‌ను కట్‌ చేసి చెరో రూ.50వేలు పట్టుకుపోయారు. కొద్దిసేపటికి బాధితులు చూసేసరికి చెరో పాలిథిన్‌ కవర్‌లో రూ.50 వేలు చొప్పున కనిపించలేదు. లబోదిబో మంటూ బాధితులు పోలీసులకు సమాచారం అందిం చారు. దీంతో ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి సిబ్బందితో హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. చోరీకి పాల్పడింది ఆ ముగ్గురు మహిళలేనని నిర్ధారంచారు. పట్టపగలు ఇటు వంటి చోరీ జరగడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:07 AM