గంగమ్మతల్లి ఆలయంలో చోరీ
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:56 PM
చెన్నాపురం గ్రామంలోగల గంగమ్మతల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరి జరిగిందని ఆలయ ధర్మకర్త ముత్తాసింహాచలం శనివారం పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
నరసన్నపేట, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): చెన్నాపురం గ్రామంలోగల గంగమ్మతల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరి జరిగిందని ఆలయ ధర్మకర్త ముత్తాసింహాచలం శనివారం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో గల హుండీ, అమ్మవారి బంగారం ముక్కుపుడక చోరీకి గురైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ.60వేలు విలువ చేస్తాయని ధర్మకర్త తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.