చీడిపూడి వేంకటేశ్వరాలయంలో చోరీ
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:50 PM
చీడిపూడి వేంకటేశ్వరాలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది.
జలుమూరు (సారవకోట), నవంబరు 23(ఆంధ్రజ్యోతి): చీడిపూడి వేంకటేశ్వరాలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం ప్రధాన ద్వారం వద్ద గల తలుపు గడియ విరగగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆలయంలో గల 750 గ్రాముల వెండి ఆభరణాలు, ఎనిమిది కిలోల ఇత్తడి వస్తువులు అపహరించు కుపోయారు. ఆదివారం ఉదయం ఆలయం తలుపులు తెరవడానికి అర్చకులు పీసపాటి రామానుజచార్యులు వెళ్లే సరికి తలుపులకున్న గడియ విరిగి ఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.