అసిరిపోలమ్మ గుడిలో చోరీ
ABN , Publish Date - May 21 , 2025 | 12:05 AM
మండలంలోని ముద్దాడలో గల అసిరి పోలమ్మ తల్లి గుడిలో సోమవారం అర్థరాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముద్దాడ నుంచి రుప్పపేట వెళ్లే రోడ్డులోని అసిరి పోలమ్మ గుడి తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.
ఎచ్చెర్ల, మే 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని ముద్దాడలో గల అసిరి పోలమ్మ తల్లి గుడిలో సోమవారం అర్థరాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముద్దాడ నుంచి రుప్పపేట వెళ్లే రోడ్డులోని అసిరి పోలమ్మ గుడి తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టి చోరీకి పాల్ప డ్డారు. కిలోన్నర వెండి, తులం బంగారంతో పాటు హుండీలోని సుమారు రూ.15 వేలను దొంగలు ఎత్తుకుపోయారు. గ్రామానికి చెందిన బి.రామా రావు మంగళవారం ఉదయం అమ్మవారి దర్శనానికి వెళ్లగా.. తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐదు మద్యం సీసాలు స్వాధీనం
ఇచ్ఛాపురం, మే20(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురంలో ఐదు మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ పి.దుర్గా ప్రసాద్ తెలిపారు. మంగళవారం సిబ్బంది లక్ష్మణ్, సూర్యారావుకు సమా చారం రావడంతో ఇచ్ఛాపురంలోని అయ్యప్ప ఆలయం సమీపంలో తనిఖీ చేశారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఒడిశాకు చెందిన 48 బీర్, ఐదు మద్యం సీసాలు తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న కర్రి షణ్ముఖరావు, నర్తు మోహన్‌రావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిం చామని తెలిపారు.
మృతుడు గంజాం జిల్లా వాసి
నరసన్నపేట, మే 20(ఆంధ్రజ్యోతి): కోమర్తి గ్రామం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి రంజిత్‌కుమార్ కబీ(30) నిర్ధారించారు. గాయపడిన వక్తి రాజేంద్ర భిశ్వాల్‌కిండు పడార్. వీరు స్వగ్రామం నుంచి విశాఖపట్నం ద్విచక్రవాహనంపై వెళుతూ డివైడర్ ఢీకొనడంతో వాహనం అదుపు తప్పి మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.