Youngmen attempts suicide : ప్రేమించిన యువతి.. పెళ్లికి నిరాకరించిందని..
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:02 AM
suicide attempts by climbing cell tower శ్రీకాకుళం నగరంలోని దీపామహల్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో సెల్‌టవర్‌పైకి ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సెల్‌టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని దీపామహల్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో సెల్‌టవర్‌పైకి ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. పొందూరు మండలం కింతలి గ్రామం దేవాదివీధికి చెందిన విబూది శివకుమార్.. హైదరాబాద్‌లో ఎంఎస్ చేస్తున్నారు. ఐదేళ్లుగా ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌కు చెందిన ఓ యువతి, సూరిబాబు ప్రేమించుకుంటున్నారు. ఆ యువతి ఇంటిలో ప్రేమ వివాహానికి అంగీకరించడం లేదంటూ శివకుమార్‌ను గత కొన్ని నెలలుగా దూరం పెట్టింది. కొద్దిరోజుల కిందట శివకుమార్ యువతి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుందామని మరోసారి అడగ్గా.. ఆమె నిరాకరించింది. అనంతరం శివకుమార్ వేధిస్తున్నాడని ఆ యువతి కుటుంబ సభ్యుల సాయంతో ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఎచ్చెర్ల పోలీసులు శివకుమార్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. దీంతో శివకుమార్ ప్రేమించిన యువతి దక్కడం లేదని మనస్తాపం చెంది సోమవారం శ్రీకాకుళంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలోని సెల్‌టవర్ ఎక్కి దూకేస్తానని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఒకటో పట్టణ ఎస్‌ఐ హరికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు రెండున్నర గంటలు యువకుడితో మాట్లాడి నచ్చజెప్పి ఫైర్ సిబ్బంది సాయంతో కిందకు దించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి పంపించేశారు.