‘యోగాంధ్ర’ సందడి
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:59 PM
విశాఖపట్నంలో శనివారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ‘యోగాంధ్ర’కు ఎటు చూసినా సందడి నెలకొంది.
నరసన్నపేట, జూన్ 20(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో శనివారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ‘యోగాంధ్ర’కు ఎటు చూసినా సందడి నెలకొంది. నరసన్నపేట నియోజవర్గంలో నాలుగు మండలాల నుంచి 100 బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ఈ బస్సులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభిం చారు. వీరికి నరసన్నపేట, శ్రీకాకుళం ప్రాంతాల్లో కల్యాణ మండపాల్లో ప్రత్యేక వసతులను కల్పించారు. రాత్రి 12 గంటల సమయంలో బస్సుల్లో బయల్దేరి విశాఖ బీచ్ రోడ్డుకు తెల్లవారు జామున 4గంటల్లోగా చేరుకుంటారు. యోగాంధ్ర కార్యక్రమానికి వెళ్లేవారికి వసతి, భోజన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని డీఎఫ్‌వో వేంకటేశ్వరరావు తెలిపారు.
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం: ఎంజీఆర్
పాతపట్నం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక నీలమణిదుర్గ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం యోగాభ్యాసం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో టి.వాసుదేవరావు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.