‘యోగాంరఽధ’ వైపు ప్రపంచం చూస్తోంది
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:48 PM
యోగాంధ్ర వైపు ప్రపంచం చూస్తుందని, యోగా సాధనతో సంపూర్ణమైన ఆరోగ్యం పొందవ చ్చునని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళిశాఖా మంత్రి ఎస్.సవిత అన్నారు.
బీసీ సంక్షేమ, చేనేత, జౌళిశాఖా మంత్రి సవిత
రణస్థలం, జూన్ 19(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర వైపు ప్రపంచం చూస్తుందని, యోగా సాధనతో సంపూర్ణమైన ఆరోగ్యం పొందవ చ్చునని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళిశాఖా మంత్రి ఎస్.సవిత అన్నారు. ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన అధ్యక్షతన యోగాంధ్ర కార్యక్రమ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు. ఈనెల 21న విశాఖలో జరగనున్న యోగా కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గిన్నీస్ బుక్కు ఎక్కనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరుకానున్నరని, వీరి కోసం బీమిలి బీచ్ రోడ్డులో (సీ-117, సీ-126 ) కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, రామాంజనేయులు, కూటమి నాయకులు శ్రీనివాసరెడ్డి, విశ్వక్సేన్, చౌదరి బాబ్జీ, పొగిరి సుగుణాకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.