Share News

మహిళా క్రికెట్‌ జట్టు స్ఫూర్తితో ఎదగాలి

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:03 AM

మహిళా క్రికెట్‌ జట్టు స్ఫూర్తితో బాలికలు ముందుకు సాగాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. స్థానిక మహిళా కళాశాలలో కొవ్వాడ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.99 లక్షలతో నిర్మించిన అదనపు భవ నాలను బుధవారం ఆయన ప్రారంభించారు.

 మహిళా క్రికెట్‌ జట్టు స్ఫూర్తితో ఎదగాలి
అదనపు భవన సముదాయాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

పాత శ్రీకాకుళం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహిళా క్రికెట్‌ జట్టు స్ఫూర్తితో బాలికలు ముందుకు సాగాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. స్థానిక మహిళా కళాశాలలో కొవ్వాడ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.99 లక్షలతో నిర్మించిన అదనపు భవ నాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తల్లి చదివిన కళాశాల అని గత మీటింగ్‌ లో బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటానని తెలిపానన్నారు. 1300 విద్యార్థినులు కలిగి రాష్ట్రం లో మూడో అతి పెద్ద కళాశాలగా కీర్తి పొందిందన్నారు. అయితే కళాశాలలో వసతులు లేకపో వడం తనను కలవరపరిచిందని, భవిష్యత్‌లో మరిన్ని భవనా లు నిర్మిస్తామని, గ్రౌండ్‌, వ్యాయామ ఉపాధ్యాయ కొరత త్వరలో తీరుస్తామన్నారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే పరిశ్ర మలతో పాటు యువత విద్యా వకాశాలు పెంపొందించు కోవాలన్నారు. విద్యార్థినులు ఇంటర్‌ తరువాత విద్యను కొన సాగించాలని, దీనికి తాను సహకరిస్తానని భరోసా ఇచ్చారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. కళా శాలలో భవనాల లోటును గమనించి కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం సాయంతో ఐదు గదులను నిర్మించారని, ల్యాబ్‌ మరో ఐదు అదనపు భవనాలు అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. విద్యా శాఖామంత్రి నారా లోకేశ్‌ చొరవతో ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపి ణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీ రాజ్‌ కుమార్‌, ఆర్డీవో సాయి ప్రత్యూష, ఆంధ్రప్రదేశ్‌ విద్యా సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పీఎంజే బాబు, అణు విద్యుత్‌ కేంద్రం డైరెక్టర్‌ రవికుమార్‌, ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:03 AM