భర్త చితికి తలకొరివి పెట్టిన భార్య
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:05 AM
వారిద్దరూ అ న్యోన్య దంపతులు.. కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా నిలిచి జీవనం సాగించేవారు.
కోటబొమ్మాళి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): వారిద్దరూ అ న్యోన్య దంపతులు.. కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా నిలిచి జీవనం సాగించేవారు. ఇంతలో విధివారి బంధాన్ని విడదీ సింది. దీంతో భర్త చితికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుం ది. వివరాల్లోకి వెళ్తే.. గుంజిలోవ గ్రామానికి చెందిన తిర్లంగి లక్ష్మణరావు(35) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా.. శుక్రవారం ఆయన స్వగ్రామం లో అంత్యక్రియలు జరిగాయి. లక్ష్మణరావుకి భార్య రోహిణితో పాటు నిండా పదేళ్లు నిండని ఇద్దరు కుమారులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఉన్నారు. దీంతో ఏడ డుగులు నడిచినా భార్య.. అన్నితానై భర్త అంతిమయాత్రలో పాల్గొని చితికి నిప్పు పెట్టింది. ఆమె అర్తనాదాలు అపడం ఎవ్వరి వల్ల కాలేదు. కోటబొమ్మాళిలో చికె న్ దుకాణం నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు.