ప్రజల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:54 PM
ప్రజల సంక్షేమమే ధ్యేయమని ఎమ్మెల్యేలు, అధికారులు తెలిపారు. మంగళవారం జిల్లాలో సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీచేశారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయమని ఎమ్మెల్యేలు, అధికారులు తెలిపారు. మంగళవారం జిల్లాలో సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీచేశారు.
ఫ సరుబుజ్జిలి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మూలసవలాపురంలో మంగళవారం ఉదయం ఆరు గంటలకు సర్పంచ్ తర్లాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, ఎంపీడీవో ఎం.పావని, టీడీపీ నాయకులు అంబళ్ల రాంబాబు, నందివాడ గోవిందరావు, పల్లి సురేష్, తర్లాడ సురేం ద్ర, దవళ సింహాచలం పాల్గొన్నారు.
ఫఅరసవల్లి జూలై 01(ఆంధ్రజ్యోతి):శ్రీకాకుళంలోని నగరపాలక సంస్థ పరిధిలోగల దమ్మలవీధిలో ఎమ్మెల్యే గొండు శంకర్ పింఛన్ల పంపిణీచేశారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రసాదరావు, ఇంజినీర్లు, సచివాలయ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.