మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:28 PM
మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు.
ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు
రణస్థలం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు. జీరు పాలేంలో శనివారం మత్స్యశాఖ ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేపల వేట నిషేధ సమయంలో ‘మత్స్యకార భరోసా’ ద్వారా రూ.20 వేలు సాయం అందించిన ఘనత సీఎం చంద్ర బాబునాయుడుదేనన్నారు. వలసల నివారణకు హార్బర్ నిర్మాణం పనులు వేగవంతం చేస్తా మన్నారు. సాగర మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద వివిధ ఉపక రణాలు పంపిణీ చేశారు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని పలువురు మత్స్య కారులకు రూ.1.38 కోట్లు విలువైన వలలు, బోట్లు, ఇంజన్లు అందజేశారు. కార్య క్రమంలో కూటమి నేతలు లంక శ్యామలరావు, పిసిని జగన్నాఽథం నాయుడు, పిన్నింటి భానోజినాయుడు, మహంతి అనంత్ పాల్గొన్నారు.