రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:37 PM
: రైతుల సంక్షేమమే ధ్యేయంగా త్రిసభ్య కమిటీ పని చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. చల్లవానిపేట సొసైటీలో సోమవారం నిర్వహించిన త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరయ్యారు.
జలుమూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా త్రిసభ్య కమిటీ పని చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. చల్లవానిపేట సొసైటీలో సోమవారం నిర్వహించిన త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. సొసైటీ చైర్మన్‌గా దుంగ స్వామిబాబు, సభ్యులుగా కూన వీరన్నాయుడు, రెడ్డి జయరాం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి.. రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు సహకార సంఘాలను బలోపేతం చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రైతులకు అన్నివిధాలా అన్యాయం జరిగిందన్నారు. త్రిసభ్య కమిటీ సభ్యులు రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని... గ్రామస్థాయిలో టీడీపీ బలోపేతమయ్యేలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘ సీఈవో డి.సత్యనారాయణ, డీజీఎం శిమ్మ జగదీష్, డీసీసీబీ మేనేజర్ రమణమూర్తి, సొసైటీ సీఈవో రాజేశ్వరి, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, జలుమూరు, సారవకోట మండల పార్టీల అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, కత్తిరి వెంకటరమణ, నాయకులు బగ్గు గోవిందరావు, కింజరాపు సత్యం, తర్ర బలరాం, గురుబెల్లి ఝాన్సీ, వెలమల చంద్రభూషణరావు, పంచిరెడ్డి రామచంద్రరావు పాల్గొన్నారు.
సారవకోటలో...
సారవకోట, జూలై 21 (ఆంధ్రజ్యోతి): సారవకోట సొసైటీ చైర్మన్‌గా సురవరపు తిరుపతిరావు, సభ్యులు శిమ్మ రామకృష్ణ, సంపతిరావు మురళీధర్ సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
రైతుల పక్షపాతి సీఎం చంద్రబాబు
జలుమూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రైతుల పక్షపాతి సీఎం చంద్రబాబునాయుడు అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సారవకోట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన అయ్యప్ప డ్రోన్ గ్రూపు సభ్యులకు, జలుమూరు మండలం కూర్మనాథపురం గ్రామంలోని శ్రీరామన్న డ్రోన్ గ్రూపు సభ్యులకు రాయితీపై సోమవారం డ్రోన్లను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.9.80 లక్షల విలువ గల డ్రోన్‌కు ప్రభుత్వం రూ.7.84 లక్షలు రాయితీ ఇస్తోందని తెలిపారు.