థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రతిపాదనను రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:21 PM
సరుబుజ్జిలి, బూర్జ మండలాల సరిహద్దులో థర్మల్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేయాలని పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
బూర్జ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి, బూర్జ మండలాల సరిహద్దులో థర్మల్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేయాలని పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం అడ్డూరిపేట గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. థర్మల్ ప్లాంట్‌తో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడనుందని అన్నారు. అనంతరం పవర్‌ప్లాంట్ ప్రతిపాదిత ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్‌దొర, కార్యదర్శి సవర సింహాచలం, కోశాధికారి రవికాంత్, ఉపాధ్యక్షులు మిన్నారావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.