థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రతిపాదనను విరమించాలి
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:53 PM
పచ్చని పొలాల మధ్య థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మా ణం చేపట్టడం వల్ల ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు విఘాతం కలుగుతుం దని, తక్షణం ప్రభు త్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనా ద్రీశ్వరరావు డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
ఆమదాలవలస, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పచ్చని పొలాల మధ్య థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మా ణం చేపట్టడం వల్ల ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు విఘాతం కలుగుతుం దని, తక్షణం ప్రభు త్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనా ద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వ ర్యంలో పోరాట కమిటీ కన్వీనర్ వాబయోగి అధ్యక్షతన బూర్జ మండలం మశానపుట్టి గ్రామంలో గురువారం రైతులు, ఆదివాసీలు, దళితులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వడ్డే మాట్లాడుతూ.. పచ్చని ప్రకృతిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడాల్సిన పాలకులు పవర్ ప్లాంట్ నిర్మాణంతో వారికి జీవించే హక్కు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు భూ సేకరణకు ప్రయ త్నిస్తే చట్టబద్ధంగా పోరాటం చేసి అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో రైతు ఉద్యమాల వేదిక కన్వీ నర్ మహదేవ్, ప్రజా సంఘాలు, వామపక్ష నేతలు తాండ్ర ప్రకాష్, గోవింద రావు, చాపర వెంకట రమణ, హరనాథ్, డి.వర్మ, వంకల మాధవరావు, సవర సింహాచలం పాల్గొన్నారు.