విద్యార్థినులపై ఉపాధ్యాయిని భర్త దాడి!
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:59 PM
బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో వివాదం చోటు చేసుకుంది. గతంలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న సంఘటన మరచిపోకముందే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
బందపల్లి ఆశ్రమ పాఠశాలలో మరో వివాదం
మెళియాపుట్టి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో వివాదం చోటు చేసుకుంది. గతంలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న సంఘటన మరచిపోకముందే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఓ ఉపాధ్యాయిని భర్త గురువారం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను కొట్టారంటూ మరో వీడియో బయటకు వచ్చింది. తన భార్యకు చెందిన డబ్బులు దొంగిలించారని ఆరోపిస్తూ విద్యార్థినులను కొట్టారని వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. దీంతో గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయి... కొంతకాలంగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. వార్డెన్ పోస్టు కోసం తగాదాలు జరుగు తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆ ఉపాధ్యాయిని వార్డెన్‌గా ఉన్నపుడు ఆమె భర్త వచ్చే వారని స్థానికులు చెబు తున్నారు. 2024జనవరి 26న వార్డెన్‌కు సంబంధించిన నగదు రూ.250 కనిపించలేదు. దీంతో విద్యార్థినులను ఉపాధ్యాయిని భర్త ప్రశ్నించారని...ఆ సమయంలో తనపై ఆయన చేయి చేసుకున్నారని విద్యార్థిని ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాదికి సంబంధించిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని ఉపాధ్యాయిని చెబుతున్నారు. ఈ విషయమై ఐటీడీఏ డీడీ అన్నదొర గురువారం పాఠశాలలో విచారణ చేపట్టారు. పాత, ప్రస్తుత హెచ్‌ఎంలను సంఘటనపై ఆరా తీశారు. దీనిపై పూర్తి వివరాలు తె లియజేయాలని వారిని కోరారు. వి ద్యార్థినులతో మాట్లాడారు. దీనిపై ఏటీడ బ్ల్యూవో సూర్యనారాయణ మాట్లాడుతూ సంఘటనకు సంబంధించిన వివరాలపై ఐటీ డీఏ పీవోకు నివేదిక ఇస్తామని తెలిపారు.