జాతీయస్థాయిలో సిక్కోలు క్రీడాకారుల ప్రతిభ
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:39 PM
తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు జరిగిన 71వ సీనియర్, సబ్ జూనియర్ జాతీయస్థాయి బాల్ బాడ్మింటన్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడా కారులు రాష్ట్రం నుంచి ప్రతిభ కనబరిచారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు జరిగిన 71వ సీనియర్, సబ్ జూనియర్ జాతీయస్థాయి బాల్ బాడ్మింటన్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడా కారులు రాష్ట్రం నుంచి ప్రతిభ కనబరిచారు. సబ్‌జూనియర్స్ విభాగంలో బాలురు జట్టు ద్వితీ యస్థానం కైవసం చేసుకుంది. సీనియర్స్ విభాగంలో మహిళా జట్టు తృతీయస్థానం సాధించింది. ఈ పోటీల్లో మన జిల్లా వాసులు ప్రధాన భూమిక పోషించారు. సబ్ జూనియర్ విభాగంలో ఎన్. ప్రవీణ్ కుమార్ (ఎచ్చెర్ల), టి.అఖిల్ (నరసన్నపేట), బి.జ్యోత్స్న (సానివాడ), సీహెచ్ శ్రావణి (సానివాడ) పాల్గొన్నారు. సీనియర్ మహిళా విభాగంలో ఎం.గాయత్రి (ఎచ్చెర్ల) పాల్గొని ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సంఘం చైర్మన్ సూర శ్రీనివాసరావు, అధ్యక్షుడు కోత పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శి పీవీజీ కృష్ణంరాజు తదితరులు అభినందించారు.
బారువవాసికి అథ్లెటిక్స్‌లో కాంస్యం
సోంపేట, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): బారువ గ్రామానికి చెందిన బి.కృష్ణ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఈనెల 26, 27, 28 తేదీల్లో నిర్వహిం చిన చాంపియన్‌షిప్ పోటీల్లో అండర్-20 విభాగంలో హేమర్ త్రో అంశంలో తృతీయస్థానం సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్థులు, స్నేహి తులు అభినందించారు.