Share News

వైసీపీ హయాంలో రాష్ట్రం నాశనం: కళా

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:35 PM

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారని, మాజీ సీఎం జగన్‌రెడ్డి, మాజీ మంత్రి బొత్సలు అభివృద్ధి విధ్వంసకారులని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు.

వైసీపీ హయాంలో రాష్ట్రం నాశనం: కళా
మాట్లాడుతున్న కళా వెంకటరావు

అరసవల్లి,జూలై 27 (ఆం ధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారని, మాజీ సీఎం జగన్‌రెడ్డి, మాజీ మంత్రి బొత్సలు అభివృద్ధి విధ్వంసకారులని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. ఆదివారం అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామిని సతీసమేతంగా దర్శిం చుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఏడాది పాలనలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. అన్ని విధాలా అన్యాయమైపోయిన రాష్ట్రాన్ని మళ్లీ చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం దిశగా విజయవంతంగా నడిపిస్తున్నారన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇది చూసి ఓర్వలేక వారు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. ఉత్తరాంధ్రను ఎప్పుడూ టీడీపీ ప్రత్యేక దృష్టితోనే చూస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎస్వీ రమణ మాదిగ, జల్లు రాజీవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:35 PM