Share News

పెట్టుబడుల హబ్‌గా రాష్ట్రం

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:32 PM

విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సులో 613 ఒప్పం దాలు, రూ.13.27 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రం పెట్టుబడుల హబ్‌గా మారనుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

పెట్టుబడుల హబ్‌గా రాష్ట్రం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సులో 613 ఒప్పం దాలు, రూ.13.27 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రం పెట్టుబడుల హబ్‌గా మారనుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. సోమవారం విశాఖ-ఎ కాలనీలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తో రాష్ట్రం ప్రపం చం దృష్టిని తనవైపు తిప్పుకుందన్నారు. నూతన ఒప్పందాలతో రాష్ట్రానికి 16.23 లక్షల ఉద్యోగాలు రానున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు, క్వాంటమ్‌, మెట్రో, ఐటీ తదితర రంగాల్లో పెట్టుబడులతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ సమర్థత, విజన్‌తో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ వచ్చిందన్నారు. వైసీపీ హయాంలో భయపడి పారి పోయిన కంపెనీలు కూడా రాష్ట్రానికి రావడం సంతోషదాయక మన్నారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నేతలు మధుబాబు, నాగేంద్రయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:32 PM