శ్రీకాకుళం సాయుధ పోరాటం ప్రత్యేకం
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:52 PM
దేశం లో సాయుధ పోరాటాలు ఎన్ని జరిగినా శ్రీకాకుళం విప్లవ సాయుధ పోరాటానికి ఓ ప్రత్యేకత ఉందని విప్లవ రచయితల సంఘరాష్ట్ర అధ్యక్షుడు అరస వెల్లి కృష్ణ అన్నారు.
ఈ పోరులో చిరసర్మణీయురాలు సురేఖపాణిగ్రాహి
విప్లవ రచయితల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ
పలాస రూరల్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): దేశం లో సాయుధ పోరాటాలు ఎన్ని జరిగినా శ్రీకాకుళం విప్లవ సాయుధ పోరాటానికి ఓ ప్రత్యేకత ఉందని విప్లవ రచయితల సంఘరాష్ట్ర అధ్యక్షుడు అరస వెల్లి కృష్ణ అన్నారు. అటు పోరాటం, ఇటు జము కుల కళ ద్వారా కవి సుబ్బారావుపాణిగ్రాహి ప్రజ లను చైతన్యపర్చారని, ఆయన పోరాటానికి సు రేఖపాణిగ్రాహి బాసటగా నిలిచి చిరస్మరణీయురా లయ్యారని అన్నారు. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో గురువారం సుబ్బారావుపాణిగ్రాహి సతీమ ణి సురేఖపాణిగ్రాహి సంతా పసభ నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన కృష్ణ మాట్లా డుతూ.. సుబ్బారావు పాణిగ్రాహి పోరాటంలో అమరుడయ్యారని, ఆయన ఆశయాలను సురేఖ పాణిగ్రాహి ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ప్ర స్తుతం మధ్యభారతంలో సహజ సంపదను కొల్లగొట్టేందుకు కేంద్రం యత్నిస్తోందని, ఆపరేషన్ కగార్ పేరిట అమాయకులైన ఆదివాసీలపై యు ద్ధం సాగిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో అమరుల బంధుమిత్రుల సంఘం జిల్లా సభ్యుడు తామాడ త్రిలోచనరావు, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకలు మద్దిల మల్లేశ్వరరావు, అరుణోదయ సాంస్కృతిక కళామండలి నాయకులు సన్నశెట్టి రాజశేఖర్, రైతుకూలీ సంఘ నాయకులు వర్మ, సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్రకమిటీ సభ్యుడు హరనాథ్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అరుఽణోదయ సంఘ సభ్యులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.