తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:02 AM
పాతపాడు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు టంకాల చిన్నప్పలనాయుడు (65) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఒక కుమార్తె అమెరికాలో, మరొకామె బెంగళూరులో, మరొకరు విశాఖపట్నంలో కుటుం బాలతో ఉంటున్నారు.
సరుబుజ్జిలి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పాతపాడు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు టంకాల చిన్నప్పలనాయుడు (65) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఒక కుమార్తె అమెరికాలో, మరొకామె బెంగళూరులో, మరొకరు విశాఖపట్నంలో కుటుం బాలతో ఉంటున్నారు. తండ్రి చనిపోయిన సమయానికి ఇద్దరు కుమార్తెలు అందుబాటులో లేకపోవడంతో మగ సంతానం లేని చిన్న ప్పలనాయుడు మృతదేహానికి పెద్ద కుమార్తె విజయలక్ష్మి అంత్యక్రియలు చేశారు. ఉపాధ్యా యుడిగా ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొంది అనేక సంఘ సేవ కార్య క్రమాలు నిర్వహించారు అప్పలనాయుడు. అలాగే ఆంజనేయస్వామి గుడి నిర్మాణం చేపట్టారు.