స్మార్ట్ కిచెన్ ఏర్పాటు రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:27 PM
మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసే స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటును తక్షణమే రద్దు చేయా లని ఆ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, అధ్యక్ష, కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసే స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటును తక్షణమే రద్దు చేయా లని ఆ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, అధ్యక్ష, కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. గతంలో ప్రభుత్వం అక్షయపాత్ర, నాంది ఫౌండేషన్ వంటి సంస్థ లకు కాంట్రాక్టు ఇచ్చి విషలమైందని, మరలా స్మార్ట్ కిచెన్‌ల పేరుతో ప్రైవే టు వ్యక్తులకు అప్పగించాలనుకోవవడం సరికాదన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం నేతలు టి.సీతమ్మ, కె.కౌసల్య, వై.లక్ష్మి, పి.భూదేవి తదితరులు పాల్గొన్నారు.