‘సిక్కోలు పుస్తక మహోత్సవం’ విజయవంతం కావాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:49 PM
జిల్లా కేంద్రంలోని ఏడురోడ్ల కూడలి ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నవంబరు 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న సిక్కోలు పుస్తక మహోత్సవం విజయవంతం కావాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఆకాంక్షించారు.
గుజరాతీపేట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఏడురోడ్ల కూడలి ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నవంబరు 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న సిక్కోలు పుస్తక మహోత్సవం విజ యవంతం కావాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఆకాంక్షించారు. బుధవారం సంబరాల లోగోను తన చాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇటువంటి కార్యక్ర మాలు చేపట్టడం అభినందనీయ మన్నారు. ఉత్సవ నిర్వాహకులు కె.శ్రీని వాసు, పి.సుధాకర్, జి.గిరిధర్ మాట్లాడుతూ.. సిక్కో లు పుస్తక మహోత్స వానికి జిల్లా యంత్రాంగం సహకరిస్తోందని, భవి ష్యత్‌లోనూ దీనిని కొన సాగించాలని కోరారు. ఇ.కామినాయుడు, దొంతం పార్వతీశం, కె.కూర్మారావు, పి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.