‘మనోబంధు’ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:38 PM
అనాథ, మానసిక దివ్యాంగుల సేవలో మనోబంధు ఫౌండే షన్, రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి పనిచేయడం అభినందనీయ మని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.
శ్రీకాకుళం క్రైం/అరసవల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అనాథ, మానసిక దివ్యాంగుల సేవలో మనోబంధు ఫౌండే షన్, రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి పనిచేయడం అభినందనీయ మని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయం, కలెక్టరేట్ ఆవరణలో మనోబంధు అంబులెన్స్‌ను, పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మనోబంధు ఫౌండేషన్, రెడ్‌క్రాస్ సంస్థలు సమా జంలోని అత్యంత అవసరమైన మానసిక దివ్యాంగులకు అండగా నిలిచి స్ఫూర్తి కలిగిస్తున్నాయన్నారు. మానసిక దివ్యాంగుల పునరావాసం కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ అంబులెన్స్ ద్వారా జిల్లాలో రోడ్లపై నివసిస్తున్న మానసిక దివ్యాంగులను గుర్తించి వారికి ఆహారం, వైద్యం, ఆశ్రయం వంటి సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఉత్త రాంధ్ర కన్వీనర్ బీన ఢిల్లీరావు, రాష్ట్ర సూపర్‌వైజర్ బాల సురేష్, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.