Share News

దేశ రక్షణలో సైనికుల త్యాగాలు మరువలేనివి: శంకర్‌

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:13 AM

దేశ రక్షణలో సైనికుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొ న్నారు. నగరంలోని మాజీ సైనికుల సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ దివస్‌ను శుక్ర వారం నిర్వహిం చారు.

దేశ రక్షణలో సైనికుల త్యాగాలు మరువలేనివి: శంకర్‌
రక్తదాతలను అభినందిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

అరసవల్లి, జూలై 25(ఆంధ్రజ్యోతి): దేశ రక్షణలో సైనికుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొ న్నారు. నగరంలోని మాజీ సైనికుల సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ దివస్‌ను శుక్ర వారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు నిత్య స్మరణీయమన్నారు. త్వరలో సంక్షేమ భవనం నిర్మాణం పూర్తి కానుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎ.శైలజ, సంఘం చైర్మన్‌ పి.ఈశ్వరరావు, అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు, సంఘ ప్రతినిధులు బి.సూర్యనారాయణ, పి.మురళీధర రావు, సీహెచ్‌ రామారావు, విశ్రాంత కల్నల్‌ మెండ నారాయణ రావు, పి.చంద్రశేఖర్‌, జెజె.రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:13 AM