Share News

ఏడాదిలో చేసిన అభివృద్ధిని వివరించాలి: బగ్గు

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:04 AM

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

ఏడాదిలో చేసిన అభివృద్ధిని వివరించాలి: బగ్గు
జలుమూరు (సారవకోట): మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

జలుమూరు (సారవకోట), జూలై 2(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సవరడ్డపనస పార్టీ కార్యాలయంలో బుధవారం సుపరిపాలన శిక్షణ నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సగానికి పైగా హామీలు ఏడాదిలోనే నెరవేర్చారన్నారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బగ్గు అర్చన, నియోజకవర్గ పరిశీలకుడు కోయిలాడ వెంకటేష్‌, రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు సురవరపు తిరుపతిరావు, సాధు చిన్నికృష్ణంనాయుడు పాల్గొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన

పలాస, జూలై 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను ప్రజలకు వివరించేందుకు ‘ఇంటింటికి సుపరిపాలన’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు అన్నారు. పట్టణంలోని 2, 19, 23 వార్డుల్లో బుధవారం ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలిచ్చి పథకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, సీనియర్‌ కౌన్సిలర్‌ గురిటి సూర్యనారా యణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, ఎం.నరేంద్ర (చిన్ని) వేర్వేరు బృందాలుగా వార్డుల్లో పర్యంచి ప్రభుత్వ పథకాలను వివరించారు.

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

వజ్రపుకొత్తూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పలాస నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు చౌదరి బాబ్జి అన్నారు. బుధవారం ‘సుపరి పాలనతో తొలిఅడుగు’లో భాగంగా చినవంక పంచాయతీ గుల్లలపాడులో బుధ వారం ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి పథకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, క్లస్టర్‌ కన్వీనర్‌ దువ్వాడ హేంబాబుచౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌, మండల క్లస్టర్‌ ఇన్‌చార్జి అర్సవెళ్లి ఉమామహేశ్వరరావు, అక్కు పల్లి యూనిట్‌ కన్వీనర్‌ సింగు పల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:04 AM