సమస్యల పరిష్కారానికే ‘ప్రజాదర్బార్’
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:30 AM
ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికే ప్రతి శుక్రవారం ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని... అందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు.
పోలాకి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికే ప్రతి శుక్రవారం ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని... అందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. శుక్రవారం కత్తెరవానిపేట క్యాంప్ కార్యాలయంలో వివిధ అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. గతంలో ఇచ్చిన అర్జీల పరిష్కారం ఎంతవరకు వచ్చిందన్న విషయంపై ఆరాతీశారు. నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి మండలాల ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.