అలుగును వేటాడిన వ్యక్తికి జైలు, జరిమానా
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:35 AM
టెక్కలి అటవీరేంజ్ పరిధి వజ్రపు కొత్తూరు మండలం కొమరల్తాడలో 2015లో ఒక అలుగు (జంతువు)ను వేటాడి చంపినట్టు రుజువు కావడంతో ఆ వ్యక్తికి మూడేళ్లు జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా పలాస కోర్టు న్యాయాధికారి విధించినట్టు రేంజర్ జి.జగదీశ్వరరావు తెలిపారు.
టెక్కలి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): టెక్కలి అటవీరేంజ్ పరిధి వజ్రపు కొత్తూరు మండలం కొమరల్తాడలో 2015లో ఒక అలుగు (జంతువు)ను వేటాడి చంపినట్టు రుజువు కావడంతో ఆ వ్యక్తికి మూడేళ్లు జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా పలాస కోర్టు న్యాయాధికారి విధించినట్టు రేంజర్ జి.జగదీశ్వరరావు తెలిపారు. అప్పట్లో వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 కింద అదే గ్రామానికి చెందిన రత్నాల జయరాంపై అప్పటి రేంజర్ ఏళ్ల సంజయ్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రేంజర్ జగదీశ్వరరావు మాట్లాడుతూ.. అడవి జంతువులను చప్పితే చట్టపరంగా శిక్ష తప్పదన్నారు. సెక్షన్ ఆఫీసర్ ఝాన్సీ ఉన్నారు.
ముగ్గురికి వారం రోజుల జైలు
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగి ప్రజా శాంతికి భంగం కలిగిస్తూ నడిరోడ్డుపై హల్‌చల్ చేసిన ముగ్గురు వ్యక్తులకు సెకెండ్‌క్లాస్ మెజిస్ర్టేట్ వారం రోజులు జైలుశిక్ష విధించినట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మంగ ళవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. ఈనెల 29న మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన దువ్వు సాయిపవన్, గంగారపు రాజశేఖర్, అంబటి తరుణ్ పూటుగా మద్యం తాగి రోడ్డుపై హల్‌చల్ చేశారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులకు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వారి ని సెకెండ్‌క్లాస్ మెజిస్ర్టేట్ ముందు హాజరుపరచగా న్యాయాధికారి శివరామకృష్ణ వానిరి జైలు శిక్ష విధించినట్టు ఎస్పీ తెలిపారు.