క్షేత్రస్థాయి ఉద్యోగుల పనితీరు మారాలి
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:54 PM
:ఉపాధి పథకం ద్వారా గ్రామా ల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం వహిం చడంపై పీయూసీ చైర్మన్, స్థానికఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమదాలవలస, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):ఉపాధి పథకం ద్వారా గ్రామా ల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం వహిం చడంపై పీయూసీ చైర్మన్, స్థానికఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తమ్మినేని శారదమ్మ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేసే విషయంలో క్షేత్రస్థాయి ఉద్యోగుల పనితీరుమరాలన్నారు. అనంతరం సభ్యులు అంచనా బడ్జెట్ ను ఆమోదించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బెండి గోవిందరావు, ప్రత్యేక ఆహ్వా నితులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, ఎంపీడీవో రామ్మోహన్, సర్పంచ్‌లు నూకరాజు, బొడ్డేపల్లి గౌరీపతిరావు పాల్గొన్నారు.
ఫసరుబుజ్జిలి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్ 2026- 27 సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ను సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎంపీపీ కిల్లి రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బడ్జెట్ వివరాలను ఎంపీడీవో ఎం.పావని, ఏవో ప్రసాద్ సభ్యులకు 2025-26 సవరణ బడ్జెట్ 2026-27 అంచనాబడ్జెట్ గురించి వివరించారు. 2026-27 అంచనా బడ్జెట్‌లో రూ.26,64,200 ప్రారంభ నిల్వతో సుమారు 58 కోట్ల రాబడులతో రూపొందించి దానిలో సుమారు 58 కోట్ల రూపాయలు ఖర్చులు చూపుతూ 27,15,200 మిగులు బడ్జెట్ చూపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారా యణ, తహసీల్దార్ ఎల్.మధుసూదన్, ప్రత్యేకాహ్వా నితులు సత్య నారాయణ, వైస్ ఎంపీపీ గోవింద వెంకట శివానందమూర్తి పాల్గొన్నారు.
ఫపొందూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీవో కార్యాలయసమావేశ మందిరంలో సోమవారం ఎంపీపీ కిల్లి ఉషారాణి అధ్యక్షతన బడ్జెట్‌ను ఆమోదించారు. 2026-27 ఏడాదికి 35కోట్ల 87 లక్షల 51 వేల అంచనాగా ఆదాయాన్ని చూపగా 35కోట్ల70లక్షల73వేలు వ్యయంగా అంచనా వేశారు. 2025-26 ఏడాదికి రూ.35కోట్ల38లక్షలు ఆదాయంగా చూపగా రూ.35కోట్ల21లక్షలు వ్యయంగా చూపారు. 2026-27 ఏడాదిలో సిబ్బంది జీతాలకు 3కోట్ల 35 లక్షలుగా, ఉపాధిపఽథకానికి రూ.31 కోట్ల 50లక్షలుగా నిర్ణయించారు. సమావేశంలో తహసీల్దార్ ఆర్. వెంకటేష్, ఎంపీడీవో వాసుదేవరావు, పీఏసీఎస్ అధ్యక్షులు వి. మురళి పాల్గొన్నారు.