Share News

గత పాలకుల వైఫల్యమే ప్రజలకు కష్టాలు

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:57 PM

గత వైసీపీ ప్రభుత్వంలో అ వినీతి, కక్ష పూరిత రాజ కీయాలతో ప్రజా ప్రతిని ధులు కాలం గడపడం వల్లే నేడు ప్రజలకు క ష్టాలు ఎక్కువయ్యాయ ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు.

గత పాలకుల వైఫల్యమే ప్రజలకు కష్టాలు
సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి అచ్చెన్న

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో అ వినీతి, కక్ష పూరిత రాజ కీయాలతో ప్రజా ప్రతిని ధులు కాలం గడపడం వల్లే నేడు ప్రజలకు క ష్టాలు ఎక్కువయ్యాయ ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన నిమ్మాడలోని తన క్యాంపు కార్యాల యంలో ప్రజాదర్భార్‌ నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పై వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు. అలాగే విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ డీఈ, ఏఈలు పాల్గొన్నారు. అలాగే తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా వ్యవహారిక భాషా ఉద్యమ పితామహు డు గిడుగు రామమూర్తి చిత్ర పటానికి మంత్రి అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడే భాష, రాసే భాష ఒక్కటే కావాలని తపించి ఆ దిశగా ఉద్యమాన్ని నడిపిన గొప్పవ్యక్తి గిడుగు రామమూర్తి అని కొని యాడారు. అలాగే పొందర, కూరాకుల కార్పొరేషన్‌ చైర్మన్‌ దమోదర నరసింహ, తదితరులు మంత్రిని మార్యద పూర్వకంగా కలుసుకున్నారు.

Updated Date - Aug 29 , 2025 | 11:57 PM