Share News

‘గురజాడ’ దేశభక్తి గీతాన్ని ప్రచారం చేయాలి

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:32 PM

దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్వేషపూరిత వాతావరణంలో మతాలు, కులాల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందని, దీనికోసం గురజాడ రచించిన దేశభక్తి గీతాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సాహితీ స్రవంతి అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు.

‘గురజాడ’ దేశభక్తి గీతాన్ని ప్రచారం చేయాలి
ర్యాలీ నిర్వహిస్తున్న సాహితీ స్రవంతి ప్రతినిధులు

శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్వేషపూరిత వాతావరణంలో మతాలు, కులాల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన అవసరం ఉంద ని, దీనికోసం గురజాడ రచించిన దేశభక్తి గీతాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సాహితీ స్రవంతి అధ్యక్షుడు కె.శ్రీనివాస రావు, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు 163వ జయంతి సందర్భంగా ఆదివారం డే అండ్‌ నైట్‌ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌, అంబేద్కర్‌ జంక్షన్‌, కోడిరామ్మూర్తి స్టేడియం మీదుగా ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు గొంటి గిరిధర్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయ కురాలు పి.పవిత్ర, బాడాన శ్యామలరావు, కంచరాన భుజంగ రావు, డాక్టర్‌ కె.ఉదయ్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

వెలుగుజాడ.. గురజాడ

సమాజ జాగృతికి వెలుగుజాడ గురజాడ అని పలువురు వక్తలు అన్నారు. సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు జయంతిని ఆదివారం స్థానిక గాంధీ స్మారక మందిరం స్మృతివనంలో మందిర కమిటీ, తెలుగు రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహిం చారు. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ తదితర రచనలు నాటినుంచి నేటి వరకు సమాజంలో నెలకొన్న స్థితిగతులకు అద్దం పడుతు న్నాయన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషు లోయ్‌’ అని చాటి చెప్పిన గురజాడ స్ఫూర్తి ఎప్పటికీ సజీవం గా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ అవధాని పైడి హరనాథరావు గురజాడను కీర్తిస్తూ గీతాన్ని ఆలపించారు. ప్రసిద్ధ రచయిత పత్తి సుమతి రచించిన అగ్నిఖడ్గం పుస్త కాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో మందిరం ప్రతినిధులు వావిలపల్లి జగన్నాథంనాయుడు, ప్రొఫెసర్‌ విష్ణుమూర్తి, కొమ్ము రమణ మూర్తి, జామి భీమశంకరరావు, ఎంవీ వీఎస్‌ శాస్త్రి, తెరవే ప్రతినిధులు యు.నాగేశ్వరరావు, ఆర్వీ రమణ మూర్తి, నిక్కు అప్పన్న, బారువ కోమలరావు, ముట్నూరు ఉపేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:32 PM