కేంద్రీయ విద్యాలయానికి మార్గం సుగమం
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:26 PM
పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్ (హైదరాబాద్) డాక్టర్ డి.మంజునాథ్ కమల్‌జిత్‌గురు (విశాఖ పట్నం), సుయాబ్‌ఆలం (శ్రీకాకుళం) బృందం సోమవారం మధ్యాహ్నం సర్వేనెంబరు 51, సూదికొండ ప్రభుత ్వ భూములు పరిశీలించారు.
పలాస, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్ (హైదరాబాద్) డాక్టర్ డి.మంజునాథ్ కమల్‌జిత్‌గురు (విశాఖ పట్నం), సుయాబ్‌ఆలం (శ్రీకాకుళం) బృందం సోమవారం మధ్యాహ్నం సర్వేనెంబరు 51, సూదికొండ ప్రభుత ్వ భూములు పరిశీలించారు. విద్యా లయం తాత్కాలికంగా నిర్వహించేందుకు పలాస రైల్వేకాలనీలో ఉన్న పాత రైల్వే మిశ్రమ పాఠశాల (ప్రస్తుతం ఆర్పీఎఫ్ బ్యారెక్స్)ను పరిశీ లించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని బృందం ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు సీదిరి అప్పలరాజు కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలంలో విలేకర్ల సమావేశం నిర్వ హించి.. విద్యాలయం అసలు మంజూరే కాలేదని ఆరోపించిన నేపథ్యంలో.. కేంద్ర బృందం స్థల పరిశీలన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బృందం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఇక్కడ పర్యటించింది. ఆర్డీవో జి.వెంకటేష్, తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి ద్వారా వివరాలు తెలుసుకుంది. అనంతరం డిప్యూటీ కమిషనర్ డి.మంజునాథ్ విలేకర్లతో మాట్లాడుతు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అంతా సిద్ధమైందని, స్థలాలు కూడా బాగా ఉన్నాయని తెలిపారు.