Share News

కట్టుకున్నవాడే కడతేర్చాడు

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:51 PM

నౌపడ ప్రాంతంలో ఇటీవల కనిపించిన వివాహిత మృతదేహానికి సంబంఽ దించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితుని అదుపులోకి తీసుకున్నట్టు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు విలేకరులకు తెలిపారు.

 కట్టుకున్నవాడే కడతేర్చాడు
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ లక్ష్మణరావు:

సంతబొమ్మాళి, నవం బరు 24 (ఆంధ్రజ్యోతి): నౌపడ ప్రాంతంలో ఇటీవల కనిపించిన వివాహిత మృతదేహానికి సంబంఽ దించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితుని అదుపులోకి తీసుకున్నట్టు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు టెక్కలి మండలం కొండ భీంపురం గ్రామానికి చెందిన దాసరి బాలకృష్ణకు నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన కొనారి పుష్పలతతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. దంపతుల మధ్య గత మూడేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. బాలకృష్ణ వ్యసనాలకు బానిసై భార్య పుష్పలతను అనుమానిస్తూ పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండేవాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లడంతో బాలకృష్ణను మందలించారు. అందరి ఎదుట భార్య తనను అవమానించిందని భావించిన బాలకృష్ణ.. ఆమె చంపాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నందిగాంలో పుష్పలత పిల్లలతో వేరుగా కాపురం ఉంటోంది. భర్తపై మెయింటెన్స్‌ కేసు కూడా వేసింది. ఈ నేపథ్యంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న బాలకృష్ణకు ఈ నెల 20న భార్య పుష్పలత ఫోన్‌ చేసి పిల్లల గురించి మాట్లాడాలని చెప్పింది. ఇదే అదనుగా భావించిన బాలకృష్ణ టెక్కలిలో కలుసుకొని ఎవరూ లేని చోట మాట్లాడుకుందామని నమ్మించి ద్విచక్ర వాహనంలో నౌపడ మూడు రోడ్ల జంక్షన్‌లోని ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ మాట్లాడుతున్నట్లు నటించి తనతో తీసుకువచ్చిన కర్రతో ఆమె తల ముఖంపై బలంగా కొట్టి చంపాడు. ఆమె సెల్‌ఫోన్‌ను, కర్రను ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయాడు. నౌపడ వీఆర్‌వో జోగారావు ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దాసరి బాలకృష్ణను అరెస్టు చేసి రి మాం డుకు తరలించినట్లు డీఎస్సీ లక్ష్మణరావు తెలిపారు. ఈ సమావేశంలో టెక్కలి రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, నౌపడ ఎస్‌ఐ నారాయణస్వామి పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:51 PM