ప్రతి ఇంటా జాతీయజెండా ఎగరాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:32 PM
ప్రతి ఇంటా జాతీయ జెడా ఎగురవేసి దేశ సమగ్రతను చాటి చెప్పాలని వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లావ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించారు.
ప్రతి ఇంటా జాతీయ జెడా ఎగురవేసి దేశ సమగ్రతను చాటి చెప్పాలని వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లావ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించారు.
ఫఇచ్ఛాపురం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి):ఇచ్ఛాపురంలో మునిసిపల్ కమిషనర్ ఎన్.రమేష్ ఆధ్వర్యంలో హర్‌ఘర్‌తిరంగా ర్యాలీ నిర్వహిం చారు.మునిసిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ జంక్షన్‌కు వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్టాండ్ కూడలిలో మానవ హారం చేపట్టారు.
ఫ రణస్థలం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):రణస్థలంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆద్వర్యంలోహర్‌ఘర్ తిరంగా ర్యాలీ బుధవా రం నిర్వహించారు. రామతీర్ధాలు జంక్షన్ నుంచి పలువీధుల గుండా ర్యాలీ సాగింది. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు, ఉద్యో గులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫగార, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గారలో బీజేపీ మండలాధ్య క్షురాలు మైలపల్లి లక్ష్మీజనార్దన్ ఆధ్వర్యంలో హర్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పండి యోగేశ్వరరావు, ఆరంగి తిరుపతి రావు, జి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫటెక్కలి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): టెక్కలి డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు తిరంగ్ యాత్ర నిర్వహించారు. ఇందిరా గాంధీ కూడలిలో మానవహారం ఏర్పాటుచేశారు.
ఫ నరసన్నపేట, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు హార్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, బీజేపీ, సంఘ పరివార్ నాయకులు పాల్గొన్నారు.
ఫ కొత్తూరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం కొత్తూరులో ప్రభుత్వ కళాశాల నుంచి స్థానిక నాలుగు రోడ్లు జంక్షన్ వరకు విద్యార్థులతో కలిసి తిరంగర్యాలీ చేపట్టారు.అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరిసింహమూర్తి, భాస్కరరావు, ప్రసాదరావు పాల్గొన్నారు.