Share News

పుట్టలు ఏర్పడి.. శిథిలావస్థకు చేరి

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:57 PM

మండలంలోని పెద్దబాణాపురం పంచాయతీ పరిధిలోగల పాత్రుని వలస వద్ద జాతీయరహదారిపై ప్రయాణికులకోసం ఏర్పాటుచేసిన బస్సుషెల్టర్‌లో పుట్టలు ఏర్పడడంతోపాటు శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.సవరబాణాపురం, పాత్రునివలస, ఆనం దపురం తదితర గ్రామాల నుంచి ప్రయాణికులు, విద్యార్థులు పలాస, టెక్కలి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇక్కడకు వస్తుంటారు.

పుట్టలు ఏర్పడి.. శిథిలావస్థకు చేరి
పాత్రునివలస వద్ద పుట్టలతో శిథిలావస్థలో ఉన్న బస్సు షెల్టర్‌

నందిగాం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దబాణాపురం పంచాయతీ పరిధిలోగల పాత్రుని వలస వద్ద జాతీయరహదారిపై ప్రయాణికులకోసం ఏర్పాటుచేసిన బస్సుషెల్టర్‌లో పుట్టలు ఏర్పడడంతోపాటు శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.సవరబాణాపురం, పాత్రునివలస, ఆనం దపురం తదితర గ్రామాల నుంచి ప్రయాణికులు, విద్యార్థులు పలాస, టెక్కలి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇక్కడకు వస్తుంటారు. జాతీయరహదారి కావడం, నీడ లేకపోవడంతో ప్రయాణికులు ఎండ వర్షానికి షెల్టర్‌పైనే ఆధారపడాల్సివస్తోంది.షెల్టర్‌లో పుట్టలు ఉండడంతో తలదాచుకోవడానికి లోపలికి వెళ్లడానికి భయాందోళన చెం దుతున్నామని పలువురు వాపోతున్నారు. దీనికితోడు దశాబ్దాలకిందట నిర్మించిన షెల్టర్‌కావడంతో పూర్తిగా శిథిలా వస్థకు చేరుకుంది. తర్వాత మరమ్మతుకు నోచుకోకపోవడంతో పెచ్చులూడిపడుతున్నాయి. దీంతో వర్షం కురిసే సమ యంలో లోపలిఉంటే ఎటువంటిప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా ఎన్‌హెచ్‌ ఏఐ అఽధికారులు, లేకుంటేఎంపీల్యాడ్స్‌తో షెల్టర్‌ నిర్మించి ప్రయాణికుల అగచాట్లుతీర్చాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:57 PM