ఆడపడుచులపై దుష్ప్రచారం దారుణం
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:32 AM
దైవ దర్శనానికి వెళ్లిన ఆడపడుచులపై దుష్ప్రచారం చేసి అసహ్యంగా మాట్లాడడం దా రుణ మని, అటువంటి వ్యక్తిని ఏ ఆడపడుచులూ క్షమిం చరని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు.
తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలే ప్రసక్తే లేదు
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్
అరసవల్లి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): దైవ దర్శనానికి వెళ్లిన ఆడపడుచులపై దుష్ప్రచారం చేసి అసహ్యంగా మాట్లాడడం దా రుణ మని, అటువంటి వ్యక్తిని ఏ ఆడపడుచులూ క్షమిం చరని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. స్థానిక 80 అడుగుల రోడ్డులో గల జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక స్త్రీని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడడం తోక రాజకీయ నాయకునికే చెల్లిందని అన్నారు. చింతాడ రవికుమార్ చేసిన దుష్ప్రచారాలు తప్పని రుజువయ్యాయని అన్నారు. భగవంతుని సన్నిధిలో ఉన్నవారిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఫోటోలను మార్ఫింగ్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం క్షమించరాని నేరమన్నారు. ఆడపడుచులపై నీచంగా మాట్లాడిన చింతాడను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. కేజీబీవీ ప్రిన్సిపాల్‌పై తమకు ఫిర్యాదులు అందాయని... వాటిని ఉన్నతాధికారులకు పంపించామని తెలిపారు. వారు విచారించి, తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు.