కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:23 PM
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తున్న కెప్టెన్లు (డ్రైవర్లు)కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బసవరాజు అన్నారు.
అరసవల్లి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తున్న కెప్టెన్లు (డ్రైవర్లు)కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బసవరాజు అన్నారు. డ్రైవర్లకు స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో మారుమూల ప్రాం తాల్లో, సమయంతో నిమిత్తంలేకుండా సేవలందిస్తున్నామని, కాని మా సేవలను గుర్తించడంలో ప్రభు త్వం విఫలమైం దన్నారు. అరబిందో యాజమాన్యం పదేళ్లుగా అతి తక్కువ వేతనం ఇస్తోం దని, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నా వేతనాలు పెరగకపోవడతో జీవనం దుర్భరమవుతోం దని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా, బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్య క్రమంలో సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.దశరథరావు, ఎం.మణికంఠ, పలువురు సంఘ ప్రతినిధులు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు తదిత రులు పాల్గొన్నారు.