Share News

అలరించిన సుస్వరలహరి

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:26 PM

శ్రీకాకుళం నగరానికి చెందిన ఆరోహి సంగీత కళాశాల డైరెక్టర్‌ పెంకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదివారం స్థానిక బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన సుస్వరలహరి సంగీత కార్యక్రమం ఆహూతులను అలరించింది.

అలరించిన సుస్వరలహరి
కళాకారులను సత్కరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరానికి చెందిన ఆరోహి సంగీత కళాశాల డైరెక్టర్‌ పెంకి నాగేశ్వరరావు ఆధ్వ ర్యంలో విద్యార్థులు ఆదివారం స్థానిక బాపూజీ కళామందిర్‌లో నిర్వ హించిన సుస్వరలహరి సంగీత కార్యక్రమం ఆహూతులను అలరించింది. చిన్నారుల నుంచ యువ కుల వరకు వివిధ కీర్తన లను ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడు తూ.. సంగీతానికి వయ సుతో సంబంధం లేదని, ఏ వయసు వారై నా సంగీతం నేర్చుకోవచ్చని ఈ కార్యక్రమం నిరూపించింద న్నారు. అనంతరం కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో సుడా ఈఈ పొగిరి సుగుణాకర రావు, రంగస్థల కళాకారుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఎల్‌. రామలింగే శ్వరస్వామి, విశ్రాంత డీఈవో కొత్తకోట అప్పారావు, భాస్కరభట్ల శ్రీరామశర్మ, జి.సంయుక్త పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 11:26 PM