గ్రామాల అభివృద్ధే ప్రధాన ధ్యేయం: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - May 15 , 2025 | 12:07 AM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం గా ప్రభుత్వం ముందుకు వెళుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రధాన ధ్యేయం: ఎంపీ కలిశెట్టి
జి.సిగడాం, మే 14(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం గా ప్రభుత్వం ముందుకు వెళుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బుధవారం మెట్టవలస గ్రామదేవత అశిరితల్లి పండగకు హాజరై అమ్మవారికి మొక్కుకున్నారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు నా యకులతో మాట్లాడారు. చంద్రబాబు అంటేనే రాష్ట్ర ప్రజలకు గుర్తుకు వచ్చేది అభివృద్ధి అని అన్నారు. విజన్ గల నాయకుడు రాష్ట్రానికి అవసరమని ప్రజలు గుర్తించి మంచి మెజారిటీ ఇచ్చి ఎన్నుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న, ఎన్ని కష్టాలు ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొ క్కటిగా అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కూటమి నాయకు లు కామోజుల సీతారాం, బెవర జగన్నాథరావు, టంకాల మౌళీశ్వరరావు, కంచరాన సూరన్నాయుడు తదితరులు ఉన్నారు.