Share News

ఆదివాసీ గిరిజనుల భూములను రక్షించాలి

ABN , Publish Date - May 12 , 2025 | 11:48 PM

ఆది వాసీ గిరిజనుల భూములను రక్షించాలని ఆ సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఆదివాసీ గిరిజనుల భూములను రక్షించాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న గిరిజన సంఘ నేతలు

హిరమండలం, మే 12(ఆంధ్రజ్యోతి): ఆది వాసీ గిరిజనుల భూములను రక్షించాలని ఆ సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ.. గులుమూరు పంచాయతీ జగన్నాథపురంలో గిరిజనుల భూములను ఇతరులు ఆక్రమించి మోసం చేశారని, తక్షణం ఆ భూములను ఇప్పించాలని కోరారు. అనంతరం తహసీ ల్దార్‌ హనుమంతరావుకు వినతిపత్రం అం దించారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకుడు నిమ్మక అప్పన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు శిర్ల ప్రసాద్‌, గిరి జన రైతులు ఊలక దాసు, రుగడ నర్సయ్య, లక్ష్మి, భీముడు, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:48 PM