గాయపడిన వ్యక్తి మృతి
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:09 AM
బొబ్బిలి రోడ్డులోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలో బైక్ ఢీకొన్న ప్రమాదంలో మంగళవారం ఉదయం తీవ్రంగా గాయపడిన రాగోలు విశ్వనాథం(49) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.
రాజాం రూరల్, జూన్4 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి రోడ్డులోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలో బైక్ ఢీకొన్న ప్రమాదంలో మంగళవారం ఉదయం తీవ్రంగా గాయపడిన రాగోలు విశ్వనాథం(49) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. పట్టణం లోని మెంటిపేట కాలనీకి చెందిన విశ్వనాఽథం రేషన్ సరుకులు తీసుకు నేందుకు వెళ్తుండగా వెనుక నుంచి మితిమీరిన వేగంతో బైక్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. గాయాలపాలైన విశ్వనాఽథంను తొలుత రాజాం సామాజిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సీఐ తెలిపారు. మృతుడి భార్య మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.