ఆకట్టుకున్న అర్ధనారీశ్వరం నృత్య రూపకం
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:20 AM
శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి గ్రామంలో ‘సంప్రదాయం’ గురుకులంలో శనివారం రాత్రి నిర్వహించిన అర్ధనారీశ్వరం (శృంగారం నుంచి మోక్షం) కూచిపూడి నృత్య రూపకం ఆకట్టుకుంది.
శ్రీకాకుళం రూరల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి గ్రామంలో ‘సంప్రదాయం’ గురుకులంలో శనివారం రాత్రి నిర్వహించిన అర్ధనారీశ్వరం (శృంగారం నుంచి మోక్షం) కూచిపూడి నృత్య రూపకం ఆకట్టుకుంది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాంత బయోటెక్స్ అధినేత, పద్మభూషణ్ డా.వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయ కళలు జీవనంలో భాగమన్నారు. రాజకీయ నాయకుల భాష సరిగా లేదన్నారు. అభివృద్ధి ఒక్కటే కాదు ఇలాంటి సాంస్కృతిక కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. కళలకు కుల, మత పరిమితులు లేవన్నారు. ఈ సందర్భంగా ఆయన గురుకులా నికి రూ.కోటి విరాళం ప్రకటించి రూ.50 లక్షల చెక్కును అందించారు. ఆయనను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్ సత్కరించారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ తోట కూర ప్రసాద్, కళాసుధా శ్రీనివాస్, ‘సంప్రదాయం’ గురుకులం వ్యవస్థాపకు రాలు స్వాతి సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.