టీడీపీతోనే తెలుగుజాతికి గుర్తింపు: రవికుమార్
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:57 PM
రాష్ట్రంలో ఎన్టీఆర్ స్థాపిం చిన టీడీపీతోనే ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతికి గుర్తింపు లభించిందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్టీఆర్ స్థాపిం చిన టీడీపీతోనే ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతికి గుర్తింపు లభించిందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. అమెరికా పర్య టనలో ఉన్న ఆయన సోమవారం బోస్టన్ నగరంలో టీడీపీ ఎన్నారై విభా గం నిర్వహించిన తెలుగు కమ్యూనిటీ ఆత్మీయ సమావేశంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగుతోందన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్త మైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని, ఇదే అభివృద్ధి కొనసాగాలంటే 2029 ఎన్నికల్లో కూడా విజ్ఞులు మళ్లీ టీడీపీని గెలిపించి చంద్రబాబుకు పట్టం కట్టాలన్నారు. కార్యక్రమంలో పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.