Share News

ఆదర్శనీయుడు జ్యోతిబా పూలే

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:53 PM

ఆదర్శనీయుడు జ్యోతిబా పూలే అని పలువురు వక్తలు అన్నారు. జ్యోతిబా పూలే 199వ జయంతిని శుక్రవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్వహించారు.

ఆదర్శనీయుడు జ్యోతిబా పూలే
జ్యోతిబాపూలే చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తదితరులు

ఆదర్శనీయుడు జ్యోతిబా పూలే అని పలువురు వక్తలు అన్నారు. జ్యోతిబా పూలే 199వ జయంతిని శుక్రవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
బీసీల ఆత్మబంధువు..
నరసన్నపేట, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి):
బీసీల కోసం పాటుపడిన వ్యక్తి పూలే అని, బీసీల ఆత్మబంధువు అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట టీడీపీ కార్యాలయంలో పూలే చిత్ర పటం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలే ఆశయాలను అన్న ఎన్టీఆర్‌ ఆచరిస్తే, నేటి సీఎం చంద్రబాబు కొనసాగిస్తు న్నారన్నారు. కార్యక్రమంలో కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు శిమ్మ చంద్రశేఖర్‌, నాయకులు గొద్దు చిట్టిబాబు, మెండ రాంబాబు, ఉణ్న వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సేవలు ఆదర్శనీయం
రణస్థలం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి):
మహాత్మా జ్యోతిబా పూలే సేవలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా శుక్రవారం రామతీర్థం జంక్షన్‌ వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో కూటమి నాయకులు డీజీఎం ఆనందరావు, పిసిని జగన్నాఽథం నాయుడు, పిన్నింటి భానోజీనాయుడు, కనకారావు పాల్గొన్నారు.
ఆశయ సాధనకు కృషి చేయాలి
పాతపట్నం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి):
మహాత్మా జ్యోతిబా పూలే ఆశ య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజే శ్వరరావు అన్నారు. స్థానిక కోర్టు కూడలిలో జ్యోతి బా పూలే విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:53 PM